కమలానగర్, జె.జె కాలనీలో ఇంటింటి ప్రచారం

తెలంగాణ, ఉప్పల్ నియోజకవర్గం జనసేన పార్టీ బలపరిచిన బిజెపి అభ్యర్థి ఎన్.వి.వి.ఎస్. ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం డివిజన్ 2 లోని కమలానగర్, జె.జె కాలనీలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలసి డివిజన్ కార్యవర్గం, జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలలు పాల్గొని విజయవంతం చేశారు.