బోనెలకు మద్దతుగా నర్సీపురం గ్రామంలో ఇంటింటి ప్రచారం

పార్వతీపురం నియోజకవర్గ తెలుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్ధి బోనెల విజయ చంద్ర సతీమణి బోనెల అనూష నర్సీపురం గ్రామం, పెద్ద వీధిలో ఇంటింటికి వెళ్లి బోనెల విజయ్ చంద్ర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే సూపర్ సిక్స్ పథకాలు గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగురు మని, జనసేన పార్టీ వీర మహిళ బోనెల గోవిందమ్మ, ఖాతా విశ్వేశ్వరరావు, కర్రీ మణికంఠ జనసేన పార్టీ వీరమహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.