ఇంటింటికి జనసేన, తెలుగుదేశం

పుంగనూరు మండలం, మంగళం పంచాయతీ నందు ఆదివారం ఇంటింటికి జనసేన, తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా పర్యటించి టీడీపీ జనసేన మినీ మానిఫెస్టో “బాబు ష్యూరిటి భవిష్యత్తు గ్యారంటీల కరపత్రాలను ప్రజలకు ఇచ్చి పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ చల్లా రామచంద్రా రెడ్డి జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేనకి ఓటేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ రూరల్ అధ్యక్షులు విరూపాక్ష, మాధవ్ రెడ్డి, జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ చైతన్య రాయల్, టౌన్ ప్రసిడెంట్ నరేష్ రాయల్, ఉపాధ్యక్షులు ఆసురి బాలాజీ, కుమార్, పోలీస్ గిరి, జనసేన ప్రధాన కార్యదర్శి హరీ నాయక్, మురళి రాయల్, నందు, నాగ తేజ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.