డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ కు నివాళి అర్పించిన మార్కాపురం జనసేన

ప్రకాశం జిల్లా, మార్కాపురం జనసేన పార్టీ కార్యాలయం నందు.. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, స్వాతంత్రోద్యమ వీరుడిగా.. అన్నిటికీ మించి సమ, సమాజ స్థాపకుడిగా కీర్తిని అందుకున్న అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా.. జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి చిన్నా పాల్, జిల్లా ప్రోగ్రామ్ కమిటీ మెంబర్ వీరిశెట్టి శ్రీనివాసులు, పిన్నెబోయిన శ్రీనివాసులు, శిరిగిరి శ్రీనివాసులు, దుగ్గి రామిరెడ్డి, పోటు. వెంకటేశ్వర్లు, ఖాజావలి, ఇ. శ్రీనివాసులు, సి.హెచ్. ఫణి, రమాకాంత్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.