జనసేన పార్టీలో చేరిన గిరిజన యువత

అరకు నియోజకవర్గం డుంబ్రిగూడ మండల పరిధిలోని కొర్రా గ్రామంలో 30 కుటుంబాలకు చెందిన యువత జనసేన పార్టీలో చేరటం జరిగింది. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నమ్మబలికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది. అయితే అధికారికంలోకి రాగానే ఇచ్చిన హామీలు మరచి యువతను మోసం చేసింది. అదే సమయంలో రోడ్లు, రవాణా, వైద్యం, మౌళిక వసతుల కల్పన వంటివి గాలికి వదిలేసింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన జనసేన పార్టీకి మాత్రమే సాధ్యమని భావించి యువత జనసేన పార్టీలో చేరటం జరిగింది. వారికి అరకు జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంచార్జ్ చెట్టి చిరంజీవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించటం జరిగింది. ఈ కార్యక్రమంలో హుక్కుంపేట మండల నాయకులు బలిజ కోటేశ్వరపడాల్, డుంబ్రిగూడ మండల నాయకులు సీదరి దనేశ్వరరావు, మల్లికార్జున రావు, రమేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.