పర్యావరణ పరిరక్షణ కొరకు యువత నడుం బిగించాలని పిలుపునిచ్చిన డా. వడ్లపట్ల సాయి శరత్

పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం గురించి వివరిస్తూ అందులో భాగంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మంచినీటి కొల్లేరు సరస్సు కాలకూట విషంగా మారిన పరిణామం గురించి యువతకి విశదీకరించి, ఏటా 17 వేల టన్నుల వ్యర్థాలు కోల్లేరులో కలుస్తున్నాయని, కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణ కొరకు యువత నడుం బిగించాలని ఆ దిశగా తమ విషయ పరిజ్ఞానాన్ని వినియోగించి తరుణోపాయాలు కనుగొనాలని జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ కోరడం జరిగింది.