బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వ తీరుని విమర్శించిన డా. వంపూరు గంగులయ్య

అల్లూరిసీతారామరాజు జిల్లా, పాడేరు: జనసేన పార్టీ అరకు పార్లమెంట్ రీజియన్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా అల్లూరిసీతారామరాజు జిల్లా బడ్జెట్ విషయమై ప్రభుత్వ తీరుని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్బంగా గంగులయ్య మాట్లాడుతూ గిరిజన ప్రాంతాన్ని అల్లూరిసీతారామరాజు జిల్లాగా నామకరణమైతే చేశారు కానీ గిరిజనాభివృద్ది విషయం మాత్రం మరిచారు. గిరిజన ప్రజానీకానికి పూర్తిగా ద్రోహం చేశారు. ఉపాధి లేక వలసలు పోతున్న గిరిజనయువతకు ఉపాధి చూపే మార్గం ఈ బడ్జెట్ లో ఎక్కడైనా చూపారా?. గిట్టుబాటు ధర లేక అల్లాడిడిపోతున్న పసుపు ఇతర పంటల రైతులకోసం ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని గిరిజన ఎమ్మెల్యేలు ఏమైనా అడిగారా?. కనీసం కాఫీ కోసమైనా బడ్జెట్ కేటాయింపులు సీఎం జనన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ ఎమ్మెల్యేలు మాట్లాడే కనీస ప్రయత్నం చేసారా ?.. లేదంటే ఆ విషయం మాట్లాడితే మాకేమి ప్రయోజనమని వదిలేసారా?. పాడేరు ఐటీడీఏ పరిధిలో ఉన్న 1200 గ్రామాలను ఇప్పటికే రహదారులు లేవని అధికారంలో ఉన్నవాళ్లే చెప్పినప్పుడు వాటికోసమైన ఈ ప్రజాప్రతినిధులు అడగలేదా?.. 1800 మందిపైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఆ తల్లుల ఆవేదన అయినా ఈ బడ్జెట్ లో వినిపించలేదా?. గత ఎడాదికంటే ఈ ఏడాది రూ1800కోట్లు అధికంగా మద్యం నుంచి రాబట్టడానికి మాత్రం లెక్కలేసుకున్న మన ముఖ్యమంత్రి గారు ఎస్టీ, ఎస్సి ఉప ప్రణాళిక నిధుల్లో కాంపోనెంట్ నిధులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో చెప్పగలరా? ఈ విషయాలపై గిరిజన ప్రజానీకానికి గిరిజన ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాల్సిందే..? లేదంటే గిరిజన ప్రజలు బానిసత్వం కొనసాగింపుకి మా ప్రజాప్రతినిధులు మహాగొప్పగా కృషి చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుందని తెలిపారు.