నిమ్మలపాడు గిరిజనులకు నష్టపరిహారం చెల్లించలేదు.. జనసేన మురళికి గ్రామస్తుల ఫిర్యాదు

నిమ్మలపాడు గిరిజనులకు ఏపీఎండీసీ ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని జనసేన మురళి కి నిమ్మలపాడు గ్రామస్తులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసారు. ఈ విషయంపై గ్రామస్తులు మాట్లాడుతూ దీనికి ప్రజా ప్రతినిధిలు ఎందుకు నోరు మెదపటం లేదు.. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఏపీఎండీసీ కూడా ప్రైవేట్ సంస్థే. దీని మీద ప్రజా ప్రతినిధులు నోరు మెదపడం లేదు, గిరిజన జాతికి చాలా అవమానం. ఇంత మంది గిరిజన ప్రజా ప్రతినిధులు ఉండి గిరిజన జాతికి జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించ లేకపోవడం వెనుక ఉన్న కారణం ఏమిటి? ఇంత మంది ప్రజాప్రతినిధులు గిరిజనులు కోసమా..?, గిరిజనేతరుల మెప్పు కోసమా..?. ఇప్పుడున్న చట్టప్రకారం ఆ ప్రాంతాన్ని పునర్ వ్యవస్థ కల్పించాలి. ఆ ప్రాంతాన్ని మైనింగ్ తీయాలంటే బ్లాస్టింగ్ జరగాలంటే కనీసం గ్రామ పరిధిలో రెండు కిలోమీటర్ల దూరం గ్రామాలు ఉండాలి లేని ఎడల బ్లాస్టింగ్ చేయరాదు. అలాగే ఏపీఎండీసీ వారు యువతకు ఉపాధి గాని ఎటువంటి సదుపాయం గాని కల్పించలేదు. ప్రజా ప్రతినిధులు ఎందుకు అడగడం లేదు..?, దీనిపై జనసేన పార్టీతో కలసి తగిన సమయంలో ప్రశ్నించే ఉద్యమాలు మరియు పోరాటాలు చేస్తామని గ్రామస్తులు మరియు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సిహెచ్ మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జన్ని పండన్న, కే ధర్మన్న, ఎక్స్ సర్పంచ్ ఎస్ లచ్చన్న, వార్డ్ నెంబర్ అప్పన్న వెంకటస్వామి, వెంకట్రావు, రామన్న, సోమన్న, లచ్చన్న, పండన్న తదితరులు పాల్గొన్నారు.