శ్రీ దుర్గాదేవి ఉడుపరాట ఉత్సవంలో పాల్గొన్న డాక్టర్ కందుల

  • ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కందుల
  • ఘనంగా జరిగిన కార్యక్రమం
  • అమ్మ వారి ఆశీస్సులు అందరికీ ఉంటాయన్న డాక్టర్ కందుల

శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవము సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉడుపు రాట వేయటం జరిగింది. ఈ ఉత్సవానికి నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అభిలాషించారు.
గత ఏడాది కంటే ఈ ఏడాది దుర్గాదేవి మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు సీనియర్ నాయకులు లంకా త్రినాథ్, రఘు, గాజుల శ్రీను, మంగ, దక్షిణ నియోజకవర్గం యువ నాయకుడు కందుల కేదార్నాథ్ తదితరులు పాల్గొన్నారు.