నవ వధువులకు డాక్టర్ కందుల చేయూత

  • ఇద్దరు పెళ్లి కుమార్తెలకు బంగారు తాళిబొట్లు, పట్టు వస్త్రాలు పంపిణీ
  • 85వ రోజుకు చేరిన పవనన్న ప్రజాబాట
  • ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న డాక్టర్ కందుల

ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం
85వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఆయన పర్యటించారు. ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నానని చెప్పారు. అవసరమైతే ప్రజల తరఫునుంచి తాను పోరాటం చేయడానికి అయినా సిద్ధమేనని ప్రకటించారు. తనను నమ్మి ప్రజలు కార్పొరేటర్ గా గెలిపించాలని, వారు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానాలను ఎప్పటికీ మరలేనని తెలిపారు. జనసేన ప్రభుత్వం తోనే రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. వచ్చే ఎన్నికలలో జనసేన పార్టీ గెలవడం ఖాయమని స్పష్టం చేశారు. నవ వధువులకు చేయూత..నియోజకవర్గంలోని ఇద్దరు పెళ్లి కుమార్తెలకు డాక్టర్ కందుల నాగరాజు చేయూత అందించారు. ఇందులో 30వ వార్డు పితాని దిబ్బకు చెందిన వెంకటరావు, కామేశ్వరి కుమార్తె శిరీషకు అలాగే 31వ వార్డు గొల్లపాలెం ప్రాంతానికి చెందిన
అప్పారావు, అప్పల నరసమ్మ కుమార్తె కావ్య కు బంగారు తాళిబొట్లు, పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నరేంద్ర, ఉదయ్, అంతోని, రామారావు, అనిల్, రవి, మంగ, సరస్వతి, పుష్ప, సునీత, సంధ్య జాన్సీ, దుర్గ, కుమారి, జనసేన యువనాయలు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.