డా॥ విశ్వక్సేన్ కు శుభాకాంక్షలు తెలిపిన పాలకొండ జనసేన నాయకులు

ఎచ్చెర్ల, జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహణ వైస్ ప్రెసిడెంట్ , ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ యువనాయకులు డా॥ విశ్వక్సేన్ పుట్టినరోజు సందర్భంగా పాలకొండ నియోజకవర్గం నుండి పోరెడ్డి ప్రశాంత్ మత్స పుండరికం, పొట్నూరు రమేష్, జామి అనిల్ విశ్వక్సేన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పండ్ల బొకేతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ డా॥ పంచకర్ల సందీప్ కు పండ్ల బొకేతో స్వాగతం పలకడం జరిగింది. అదే విధంగా శ్రీకాకుళం జిల్లా నాయకులు ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ, పాతపట్నం నియోజకవర్గ ఇంన్చార్జ్ గేదెల చైతన్య, ప్రసాద్, ఉదయ్ ఎన్ని రాజు తో కలసి విశ్వక్సేన్ పుట్టినరోజు కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.