చేసిన సేవలే గుర్తింపును తెస్తాయి: ఎం.వి. నేతాజీ సుబ్బారెడ్డి

*వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం.వి. నేతాజీ సుబ్బారెడ్డి

*తోషనివాలా 93వ జయంతిని నిర్వహించిన అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్

*జెండా ఊపి నడక పోటీలను ప్రారంభించిన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్

విజయనగరం: అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్ క్లబ్ ఉద్యమకారులు, పాస్ట్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు కీర్తిశేషులు జె.ఎల్. తోషినివాలా 93వ జయంతి వేడుకలను బుధవారం ఉదయం స్థానిక అయ్యాన్నపేట జంక్షన్ వద్ద నిర్వహించారు.

ఈ వేడుకలల్లో భాగంగా ముందుగా ముఖ్యఅతిధిగా విచ్చేసిన వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం.వి. నేతాజీ సుబ్బారెడ్డి చేతులు మీదుగా తోషినివాలా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నడక పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సమాజంలో చేసిన సేవలు వృధా పోవని, సేవలు గుర్తింపును ఇస్తుందని, వాకర్స్ క్లబ్బులు సమాజానికి స్ఫూర్తిగా ఉంటాయనడంలో అతిశయోక్తి కాదని,నడక సభ్యులు తమ నడకతో ఆరోగ్యం కాపాడు కుంటూ సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయన్నారు.

తోషినివాలా క్రమశిక్షణకు మారుపేరని, వాకర్స్ క్లబ్బలు అభివృద్ధి చెందడానికి,క్లబ్బులు పెరగడానికి కృషిచేసిన మహనీయుడు తోషినివాలా అని, ఆయన్ను ప్రతీ ఒక్కరూ ఆదర్శముగా తీసుకోవాలన్నారు.

అనంతరం నడకపోటీల్లో గెలుపొందిన విజేతలకు వచ్చిన అతిధులచే బహుమతులు ప్రధానోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా డిస్ట్రిక్ట్-102 గవర్నర్ పి.జి. గుప్తా, క్యాబినెట్ కార్యదర్శి సంజీవరావు, ఛైర్పర్సన్,42వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పిన్నింటి కళావతి, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎ.ఎస్. ప్రకాశరావు,ఆర్.సి.-3, జి. కృష్ణంరాజు, వాకర్స్ పెద్దలు నాలుగెస్సల రాజు, ఎలక్ట్ గవర్నర్ కె.సత్యం, తోషినివాలా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఈ. విజయకుమార్,అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ పెద్దలు అదాడ మోహనరావు, డాక్టర్ ఎస్. మురళీమోహన్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, లోపింటి కళ్యాణ్, రాము, సాయి తదితరులు పాల్గొన్నారు.