బి కొత్తూరు గ్రామం నందు పలువురిని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ బి కొత్తూరు గ్రామం నందు పలు సమస్యలతో బాధపడుతున్నటువంటి బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి వారి యొక్క కుటుంబాల అవసరాల నిమిత్తం బియ్యం బస్తాలు మరియు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించిన బాధిత కుటుంబాలు

  1. పోలునాటి గోగులమ్మ (పోషకాహార లోపం మరియు బోధకాలు)
  2. ముడుగు కొండరాజులు, (కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమై ఉంటున్న వ్యక్తి)
  3. ఎమ్ముల సూర్యుడు ( కొంతకాలం కిందట యాక్సిడెంట్ కారణంగా మంచానికే పరిమితమైన ఉంటున్నారు )
  4. దడాల చల్లారావు ( కొద్దికాలం నుంచి కాళ్లు చేతులు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యారు)
  5. కూరాడ పాము రాజు ( షుగర్ వ్యాధి కారణంగా కాళ్లు తొలగించడం జరిగింది.)
  6. షేక్ నుకన్ సాహెబ్ ( కిడ్నీ ఆపరేషన్ కారణంగా ఇంటికి పరిమితమయ్యారు)
  7. ఆకేటి గోవింద్ ( కొద్దిరోజుల క్రితం నుంచి కాళ్లు చచ్చిపడి మంచానికి పరిమితమయ్యారు ) వీరందరిkee జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి కొద్ది మేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
    జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మాట్లాడుతూ బి కొత్తూరు గ్రామం లో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేక కుటుంబాలు ఉన్నాయని త్వరలోనే ఈ బి కొత్తూరు గ్రామంలో మెగా ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా మందులు మరియు పరీక్షలు చేసే విధంగా జనసేన పార్టీ తరపు నుంచి మేము ముందుకు వెళ్తామని దీనికి బి కొత్తూరు జనసైనికులు కార్యకర్తలు వీర మహిళలు గ్రామ ప్రజలు దీనికి సహకరించాలని త్వరలోనే ఉచిత మెగా వైద్య శిఖరం ఏర్పాటు చేస్తామని డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. ఈకార్యక్రమంలో భాగంగా దుడ్డు రాంబాబు, అనుసూరి కృష్ణ, దొమ్మేటి రాజేష్, కూరడా సత్తిబాబు, ఆకేటీ స్వామి, దుడ్డు గంగాధర్, పొన్నాడ శివ, కాటూరి అనిల్, చెల్లి లాజర్, పులుగు రాంబాబు, మహేంద్రడ లావరాజు, ముడుగు నాగరాజు, రామ్ బీతుల శ్రీను, రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన దొర, గరగ సత్యానందం, గోకివాడ ఏక్ష్ సర్పంచ్, పల్నాటి మధు, మత్స్యకార నాయకులు వంక కొండబాబు, సూరిబాబు, హరిపి రెడ్డి వెంకటేష్, కర్నీడి దొరబాబు, డి శివ, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.