దసరా నవరాత్రి మహోత్సవాలలో పాల్గొన్న డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: దుర్గాడ గ్రామం నందు దసరా మహోత్సవంలో భాగంగా దుర్గాడ దుర్గామాత అమ్మవారి ఆలయంలో సౌభాగ్య స్త్రీలచే ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ అమ్మవారిని దర్శించుకుని 5116/- రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ పూజా కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి చిన్న నూకరాజు, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, కంద శ్రీనివాస్, కొప్పుల చక్రధర, ఎండపల్లి నరేష్, దేశినీడి దొర, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.