ఘనంగా శతఘ్ని న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ

అమలాపురం, శతఘ్ని న్యూస్ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ గొల్లవిల్లిలొ అతి వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విచ్చేసిన తెలుగుదేశం సీనియర్ నాయకులు మద్దింశెట్టి సురేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం ఎటువంటి లాభాపేక్ష లేకుండా పనిచేసే శతజ్ఞ న్యూస్ టీమ్ ను అభినందించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం సీనియర్ నాయకులు చీకట్ల యేసు, అరిగెల నరేష్, గనిశెట్టి తాతాజీ, జనసేన సీనియర్ నాయకులు మంచెం బుజ్జి, నాగిరెడ్డి నాగబాబు, నాగిరెడ్డి వీర్రాజు, పేరబత్తుల రాజా, యెరుబండి భద్రం, పైపూడి వీరేంద్ర, నాగిరెడ్డి మణికంఠ, చీకట్ల సాయి, మారిశెట్టి పవన్, అరిగెల సురేష్, గనిశెట్టి కిషోర్, గనిశెట్టి రాము, అధిక సంఖ్యలో తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.