పిఠాపురం రైల్వే గేట్ మూసివేతపై గళమెత్తిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ మాదాపురం రైల్వే గేటు మూసివేత పై స్పందించి అండర్ బ్రిడ్జి పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ పిఠాపురానికి ఆనుకుని ఉన్న మాదాపురం రైల్వేగేట్ గుండా ఇంచుమించు 20 నుంచి 30 గ్రామాలకు ముఖ్య రహదారిగా ఈ గేటు ఉపయోగపడుతుందని ఈ రైల్వే గేటు గుండా అధిక సంఖ్యలో రైతులు తాము పండించిన ధాన్యాన్ని ట్రాక్టర్స్ ద్వారా రైస్ మిల్లర్స్ కు అలాగే ఒట్టిగడ్డిని తీసుకెళ్ళుటకు మరియు విద్యార్థులు స్కూళ్లకు కాలేజీలకు అధిక సంఖ్యలో బస్సుల్లో ప్రయాణం చేయుటకు ఈ మాదాపురం రైల్వే గేటు ముఖ్య రహదారిగా ఉపయోగపడుతుంది. రైతు తన పండించిన ధాన్యం రైస్ మిల్లర్స్ కి తీసుకెళ్ళుటకు బస్తాకు వంద రూపాయలు చొప్పున ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అవుతుంది అని ఇప్పుడు ఈ రైల్వే గేటు మూసివేయడం ద్వారా బస్తాకు అదనంగా 50 నుండి 100 రూపాయలు ఛార్జ్ వసూలు చేసే పరిస్థితి వస్తుందని దీనివల్ల రైతులు నష్టపోతారని అలాగే స్కూల్ కి వెళ్లే పిల్లలు అధిక ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని తక్షణమే ఈ బ్రిడ్జ్ కి శాశ్వత పరిష్కారం చూపించి స్థానిక ఎమ్మెల్యేకి, ఎంపీ కి విన్నవించుకుంటున్నట్లు పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. అదేవిధంగా మనం చూస్తుంటే గోరస రైల్వే గేట్ ని మూసివేశారు. దాన్ని మూసివేయడం ద్వారా ఉప్పాడ రైల్వే గేట్ మీద అధికభారం పడింది. ఇప్పుడు ఈ మాదాపురం రైల్వే గేట్ మూసి వేయడం వల్ల కుడా ఉప్పాడ రైల్వే గేట్ మీద మరింత అధికబారం పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఉప్పాడ రైల్వే గేటు సిధిలావథ లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పాడ రైల్వే గేట్ గాని కూలిపోతే అటు ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని ఇటు పిఠాపురం మండలంలోని ఇంచుమించు 50 గ్రామాలకు రాకపోకలు శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారు తక్షణమే దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని జనసేన పార్టీ వైపు నుంచి డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల జనసేన పార్టీ వైపు నుంచి ఈ సమస్యను మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని డాక్టర్ పిల్లా శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పల్నాటి మధు, బోనం పరమేష్, కొండపల్లి శివ, దంగేటి వెంకటేష్, దంగేటి రాజా, తలారి దొరబాబు, పిల్లా శ్రీను, సైతన శ్రీనివాసరావు, గుర్రం గంగాధర్, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.