యువశక్తి సభతో యువతలో స్ఫూర్తిని, ధైర్యాన్ని నింపిన జనసేనాని: డాక్టర్ పిల్లా శ్రీధర్

  • యువశక్తి భారీ బహిరంగ సభ విజయవంతం
  • నియోజకవర్గ ప్రజలకు, జనసైనికులకు, వీరమహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు

పిఠాపురం నియోజకవర్గం: శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జరిగిన యువశక్తి భారీ బహిరంగ సభను ఉద్దేశించి పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముఖంగా మాట్లాడుతూ.. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన యువశక్తి భారీ బహిరంగ సభ విజయవంతమైందని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యువశక్తి సభలో ఇచ్చిన స్ఫూర్తి యువతకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని, యువత కష్టాలు పోవాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, జనసైనికులకు, వీరమహిళలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.