అంగన్వాడి కార్యకర్తలను పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

విజయవాడ వెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అర్ధరాత్రి పిఠాపురం రైల్వే స్టేషన్లో అడ్డుకున్న పోలీసులు, 100కు పైగా అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలింపు

జీవో నెంబర్ వన్ ను రద్దు చేయాలని ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని రిటర్మెంట్ తర్వాత పింఛన్, గ్రాడ్యుయేట్ చెల్లించాలని, బిల్లులు రాక మూడు నెలల నుంచి జీతాలు రాక పలు సమస్యలతో అసెంబ్లీని ముట్టడించడానికి బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలను పిఠాపురం రైల్వే స్టేషన్ లో అక్రమ అరెస్టులను ఖండించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు అంగన్వాడి కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ వారి యొక్క ఇబ్బందులను అడిగి తెలుసుకుని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ తో ఫోన్లో మాట్లాడి అక్రమ అరెస్టులకు గల కారణాలను అడిగి తెలుసుకుని వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరడం జరిగింది. అలాగే పట్టణ ఎస్సై తో మాట్లాడి వెంటనే అక్రమంగా అరెస్టులు చేసిన అంగన్వాడీ కార్యకర్తలను విడుదల చేయాలని లేదంటే జనసేన పార్టీ వైపు నుంచి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వీళ్ళని విడుదల చేసే వరకు స్టేషన్ నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని వీళ్ళని అర్ధరాత్రి దొంగల్లా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకురావాల్సిన అవసరం ఏముందని స్టేషన్ ఎస్ఐ ని జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ నిలదీసారు. ఈ క్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ కు పోలీసులకు కొంత సమయం వాగ్వాదం అయిన తర్వాత అంగన్వాడీ కార్యకర్తలను విడుదల చేసారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు డాక్టర్ పిల్లా శ్రీధర్ కు ధన్యవాదాలు తెలిపారు.