బడే సాయి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ ఉప్పాడ అమీనాబాద్ పంచాయతీ మాయా పట్నం గ్రామం నందు బడే సాయి అకాల మరణానికి చింతిస్తూ వారి యొక్క కుటుంబాన్ని మత్స్యకార నాయకులు వంక కొండబాబు సమక్షంలో పరామర్శించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీలు బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వంక కొండబాబు, మైలపల్లి రాజు, మైలపల్లి శివ, వీరబాబు,బడే స్వామి, బడే శ్రీను, బడే నాగు, ఎం దావీదు, ఎం మల్లి, పిక్కి ఆనంద్, పిక్కి రాంబాబు, బడే పెంటయ్య, బడే ప్రసాద్, కోదా ప్రసాద్, కోదా జాన్, పిక్కి ఎలీషా, మోష నాగు, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.