పేర్ని నాని, అంబటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం: జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ప్రచార రథంపై పేర్ని నాని అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ కి దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్. జనసేన ప్రచార రథం వారాహి ని రిలీజ్ చేయగానే ఎక్స్ మినిస్టర్లు మినిస్టర్లు మొదలపెట్తేసారు. ఎక్కడ ప్రచార రథంతో పవన్ కళ్యాణ్ జనాల్లోకి వస్తే వైసిపి పతనం మొదలవుతుందేమోనన్న భయంతో నిన్న పేర్ని నాని మిలట్రీ కలరు జనసేన ప్రచార రథంవారాహినికి వేశారు. ఇది ఎలాగో రవాణా శాఖ వాళ్ళు మార్చేస్తారు ఆ రంగు ఈ రంగు వేసుకోవడం కన్నా పసుపు రంగు వేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. పేర్ని నాని నువ్వు మా వాహనానికి ఏ కలర్ ఏసుకోవాలో మీరే చెప్తారు మేమెక్కడ పోటీ చేయాలో మీరే చెప్తారు మేము ఎన్ని సీట్లు పోటీ చేయాలో మీరే చెప్తారు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే డిక్టేటర్ షిప్ నా పేర్ని నాని మీకు రంగుల మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రజల జీవితాలు మార్చడం మీద పెట్టుంటే ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసి ఉండేవారు. ఎప్పుడు చూసినా సచివాలయాలకు రంగులు వేయడం కోర్టులో మొట్టికాయలు తినడం మళ్ళీ రంగులు మార్చడం అంటే వేయడానికి ఖర్చు మళ్లీ రంగులు మార్చడానికి ఖర్చు ఇలా ఖర్చు పెంచే విధంగా పరిపాలన చేస్తున్నారు మీరు అసలు మీరు ఏ శాఖకు సంబంధించిన వారు మీకు సంబంధం లేకుండా వేలు పెట్టి మాట్లాడతారు. మీరు అసలు ఆ శాఖ ఏంటి ఆ శాఖ చేయాల్సిన పని ఏంటి మీరు రవాణా శాఖ అయితే దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఏ శాఖలో పెడితే ఆ శాఖలో వేలు పెట్టి వాళ్ళు చేసే పని కూడా మీరే చేసేస్తారు. పవన్ కళ్యాణ్ ఊపిరి తీసుకుంటే కామెంట్ మాట్లాడితే కామెంట్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేసే శ్రద్ధ రైతుల మీద పెట్టుకుంటే ఈరోజు తుఫాన్ వచ్చి రైతులు విలవిల్లాడిపోతున్నారు కళ్లం లో ధాన్యం ఉండి ఆరబెట్టుకోవడానికి ప్లేస్ లేక దేశానికి రైతే వెన్నుముక అంటారు అలాంటి రైతుని ఈరోజు తుఫాన్ లో వదిలేశారు. అంబటి రాంబాబు మంచి ప్రశ్నలతో మాట్లాడుతున్నారు ముందు మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసిన ప్రత్యేక ప్యాకేజీ ఏమైందని నేను అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పవన్కళ్యాణ్ మీద స్పెషల్ కమిషన్ వేయించండి మీకు దమ్ముంటే మీ శాఖ ఏంటండీ నీటిపారుదల శాఖ ముందు మీ శాఖ మీద దృష్టిపెట్టండి. పోలవరం పనులు ఏమైనాయి ముందు మీ శాఖను మీరు సరిచేసుకోండి. రాబోయేది జసనసేన అందరికి మంచిరోజులు రాబోతున్నాయి జనసేన ప్రచార రధం వచ్చి కలుపు మొక్కలను పీకినట్టు పీకిపారేస్తుంది వైసీపి పిలకలను అంటూ డాక్టర్ పిల్లా శ్రీధర్ ఫైర్ అయ్యారు.