కరెడ్ల సత్తిబాబును పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు పట్నం 17వ వార్డు కరణం గారి తోటలో జనసైనికుడు కరెడ్ల సత్తిబాబు గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్నరు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారి రిపోర్టులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం వ్యాధికి సంబంధించిన డాక్టర్ గారితో మాట్లాడి వైద్య అందేలా చూస్తానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నారిపిరెడ్డి ఏసు, వేగిశెట్టి తాతారావు, ఉలవశెట్టి శ్రీను, బి ప్రత్తిపాడు ఎక్స్. ఉపసర్పంచ్ బొజ్జ బుల్లి రాజు, సోడిశెట్టి లచ్చిబాబు, పడాల గంగ, నారిపిరెడ్డి గంగ, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.