పేపకాయల రాము కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం పట్నం నందు ఐదో వార్డ్ లో గల పేపకాయ విష్ణుమూర్తి సతీమణి రాము గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో స్థానిక జనసైనికులు ఆ కుటుంబ యొక్క పరిస్థితిని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, విషయం తెలుసుకున్న జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ వెంటనే స్పందించి పేపకాల రాము కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాల నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బొజ్జ కుమార్, తోటకూర మధు, పల్నాటి మధు, పిట్టా చిన్న, గరగా బాబీ, బెల్లంకొండ రవి, గంజి సురేష్ బొజ్జ సునిల్, మరియు జన సైనికులు పాల్గొనడం జరిగింది.