బెజవాడ మల్లి కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామానికి చెందిన బెజవాడ మల్లి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అతి చిన్న వయసులోనే నోటి కాన్సర్ కారణంగా మరణించారు. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యన్ని అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ మొగిలి శ్రీను, బొజ్జ గోపి కృష్ణ, వీరాంరెడ్డి అమర్, పల్నాటి మధుబాబు, మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.