నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు కూకట్‌పల్లి జనసేన ఘన నివాళి

కూకట్‌పల్లి: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ధీరుడు స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గంలో సోమవారం బాలాజీ నగర్ కాలనీలో జనసేన నాయకులు తుమ్మల మోహన్ కుమార్, భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ కు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చరణ్, ప్రకాష్, అంజలి, రాజ్యలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు.