అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘననివాళులర్పించిన డాక్టర్ శ్రీధర్ పిల్లా

పిఠాపురం: ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం తెలుగు వారందరికీ స్ఫూర్తిదాయకం. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుని స్మరించుకుంటూ, రాష్ట్ర ప్రజల అందరికీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా (ఎండి జనరల్ మెడిసిన్) పిఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ సమీపంలో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం వద్దగల అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ భాషాప్రయుక్త రాష్ర్టాలకు బీజం వేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు ఆయనతో పాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి. దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. పొట్టి శ్రీరాములు తనను తాను సమాజాభివృద్ధికి, నిర్మాణానికి పాటుపడే కార్యకర్తగా నిర్వచించుకునేవారు. ఆయనకు రాజకీయాల్లో చేరాలనే ఆసక్తి లేదు. కానీ, రాష్ట్ర ఏర్పాటు అనేది రాజకీయ సమస్య. అప్పటికే అది చాలా తీవ్రమైన సమస్యగా మారిపోయింది. మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం, నిబద్ధతతో ముందుకెళ్లవలసిన అవసరం ఉందని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా బాలిపల్లి అనిల్, వెలుపల చక్రధర్ రావు, పల్నాటి మధు, బొమ్మిడి వీరబాబు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు మరియు జన సైనికులు పాల్గొన్నారు.