అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘననివాళులు అర్పించిన గుంటూరు జనసేన

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములుకి ఘననివాళులు అర్పించిన గుంటూరు జనసేన పార్టి నగర అధ్యక్షులు నేరేళ్ళ సురేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం గుంటూరులోని హిందుకాలేజ్ సెంటర్లో గల అమరజీవి పొట్టిశ్రీరాములు విగ్రహనికి జనసేన పార్టీ నగర అధ్యక్షులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టి నగర అధ్యక్షులు నేరేళ్ళసురేష్ మాట్లాడుతూ ఉమ్మఢి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కోరకు పోట్టిశ్రీరాములు గారు సుమారుగా 53 రోజులు కనీసం పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా ప్రత్యేక బాషా సంయుక్త రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన సంగతి ఉమ్మడి రాష్ట్రం ప్రజలందరికి తేలిసిందేనని నేరేళ్ళ సురేష్ అన్నారు…. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కొరకు పొట్టి శ్రీరాములు గారు చేసిన కృషి ఆనిర్వచనీయమని అన్నారు.. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తించి తెలుగు ప్రజలు మనస్పూర్తిగా అయనను గుర్తు చేసుకోవటం చాలా సంతోషించదగినదని సురేష్ అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు వద్దు ఒకటే రాజధాని ముద్దు . ఇదే ఆయనకి ఘననివాళులని అన్నారు… ఈకార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, నగర ఉపాధ్యక్షులు చింతా రేణుకారాజు, నగర ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉదయ్, బండారు రవీంద్ర, నాగేంద్ర సింగ్, త్రిపుర, పాములూరి కోటి, సుంకే శ్రీను, బాలకృష్ణ, కొత్తకోటి ప్రసాద్, చేజేర్ల శివ, రోశయ్య, బాషా, దొంత నరేష్, నగర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు..