శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్. పిల్లా దీపిక శ్రీధర్

పిఠాపురం: జూన్ 14వ తేదీ నుండి అన్నవరం నుండి ప్రారంభమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని కోరుతూ.. పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ పిల్లా దీపిక దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్తాత్రేయుడు ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీ వల్లభ స్వామిని డాక్టర్ పిల్లా శ్రీధర్ డాక్టర్ పిల్లా దీపిక దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. అనంతరం వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని కోరుతూ.. ఔదుంబరవృక్షానికి డాక్టర్ పిల్లా శ్రీధర్ డాక్టర్ పిల్లా దీపిక దంపతులు కొబ్బరికాయ ముడుపుని కట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆశీస్సులతో 2024లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివ శంకర్, ఎక్స్ సర్పంచ్ గరగ సత్యానందరావు, బొజ్జ గోపికృష్ణ, వీరారెడ్డి అమర్, బిజెపి నాయకులు తోట ఏడుకొండలు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాల రావు, గుర్రం గంగాధర్, కీర్తి చంటి, పిల్లా వీరబాబు తదితరులు పాల్గొన్నారు.