సిరిపురం సురేష్ ఆధ్వర్యంలో డ్రైనేజీ శుభ్రం

మైలవరం నియోజకవర్గం, కొండపల్లి మున్సిపాలిటీ కొత్తగేటు గ్రామంలో 27వ వార్డుకు సంబంధించిన డ్రైనేజీ కాలువ గత మూడు నుంచి నాలుగు నెలలుగా డ్రైనేజీ కాలువ శుభ్రం చేయకపోవడం వల్ల విష జ్వరాలు ప్రభలడమే గాక ఇంట్లోకి దోమలు ఈగలు వస్తున్నాయని మేము చాలా ఇబ్బందికి గురవుతున్నామని స్థానికంగా ఉన్న నివాసితులు తెలియజేయడం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే సిరిపురం సురేష్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీకి తెలియపరచి మున్సిపాలిటీ వ్యక్తుల ద్వారా దగ్గరుండి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పరిశుభ్రం చేయించడం జరిగింది. అనంతరం కొత్తగేటు బైబిల్ చర్చి రోడ్లో మూడు స్ట్రీట్ లైట్లు మార్పించడం జరిగింది.