తాగునీటి సమస్య పరిష్కరించాలి: జనసేన డిమాండ్

  • కడప కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన సిద్దవటం మండల ఇంఛార్జి కొట్టే వెంకట రాజేష్

పెద్దపల్లి పంచాయతీ బొగ్గిరెడ్డిపల్లి ఎస్టి కాలనీలోని ప్రజలు త్రాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. విషయం జనసేన నాయకుల దృష్టికి రాగా, కాలనీలోని ప్రజలను కారణం అడిగితెలుసుకుని కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల జనసేన ఇంఛార్జి కొట్టే వెంకట రాజేష్ మట్లాడుతూ.. ఎస్టి కాలనీలో గత 5 సంవత్సరాల కిందట బోరు వేసినా ఇప్పటివరకు కూడా పైపులు వైరింగ్ వేయలేదు. నీటీ కోసం ప్రజలు, రైతులు పొలాల్లోకి వెళ్ళి నీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఆ సంస్యను ఆ కాలనీ ప్రజలు నా దృష్టికి తీసుకురాగా చలించి సోమవారం కలెక్టర్ గారికిఉ ఫిర్యాదు చేయగా, కలెక్టర్గారు సానుకూలంగా స్పందించడం జరిగింది.