నెల్లూరు నగరంలో తాగునీటి కొరతా..?

నెల్లూరు సిటీ : స్థానిక 6వ డివిజన్ అరుంధతి పాలెంలో తాగునీరు సరిగా రావడం లేదని ప్రజలు ఇబ్బంది గురవుతున్నారని స్థానిక డివిజన్ జనసేన పార్టీ ఇంచార్జ్ సుమంత్ తెలుపగా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ స్థానికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 100 కుటుంబాలకు నీరు రెండు, మూడు రోజులకు ఒక గంట మాత్రమే వస్తున్నాయని.. స్థానికంగా బోరు ఏర్పాటు చేసినా పూర్తిగా వినియోగంలోకి తేకపోయే సరికి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నెల్లూరు నగరంలో నీరు పుష్కలంగా ఉన్నా వీరికి త్రాగినీరు అందంగా పోవడం నాయకుల వైఫల్యమే కారణం.. మొదట కలుషితమైన నీరు నలకలు మరియు రంగు మారి వస్తున్నాయని తెలుపుతున్నారు, ఎక్కడో పైపు లీక్ అవడం వల్ల ఈ సమస్య ఎదుర్కొంటున్నారని ప్రజల అనారోగ్యం పాలు కాకుండా వారిని కాపాడాల్సిన బాధ్యత నాయకులు తీసుకోవాలి. డివిజన్ ఇంచార్జ్ సుమంత్ స్థానిక సమస్యలపై ప్రజలకు అండగా నిలుస్తున్నాడని వైసిపి కార్యకర్తలు వారిపై దాడికి ప్రయత్నిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదు. ప్రజల సమస్యలు మీరు తీర్చగలిగినప్పుడు మాతో పనేముంటుంది తెలుసుకొని వ్యవహరించాలి. అధికారం అనేది శాశ్వతం కాదు, ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి. అది తెలుసుకుని నాయకులు వ్యవహరించాలి. ఈ సమస్యను కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్లి మంచినీటి సరఫరా నిరంతరాయంగా మరియు పరిశుభ్రంగా జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆరో డివిజన్ ఇంచార్జ్ సుమంత్, తేజ, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.