రాష్ట్రంలో చెలరేగి పోతున్న డ్రగ్స్ మాఫియా: కీర్తన

  • విచ్చలవిడిగా నకిలీ మెడికల్ మందులు
  • నకిలీ మందులతో ప్రాణాలు కోల్పోతున్నారు
  • కల్తీ మందులు విచ్చలవిడిగా సరఫరా అవుతున్న మొద్దు నిద్రలో వైకాపా సర్కార్
  • ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే నకిలీ మందుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం
  • అధికార పార్టీ నేతల హస్తంతో చెలరేగి పోతున్న మెడికల్ మాఫియా
  • ఆరోగ్యశ్రీ పేరుతో దోపిడి
  • డ్రగ్స్ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ లేదు

తిరుపతి: ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో మెడికల్ మాఫియా రాజ్యమేలుతోందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా ముందు కీర్తన మాట్లాడుతూ నకిలీ మందులు నుంచి ప్రారంభమైన ఈ మాఫియా, చివరికి, కర్మభూమికి తీసుకువెళ్లే ప్రవేట్ అంబులెన్స్ వరకు కొనసాగుతోంది. నకిలీ మందులు, కల్తీ మందుల విక్రయాలు, అక్రమంగా బ్లడ్‌, ప్లాస్మా సీరం అమ్మకాలతో మనుషుల ప్రాణాలతో మెడికల్‌ మాఫియా చెలగాటమడుతోంది. ఇలాంటి ముఠాలను ఆట కట్టించాల్సిన డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు మామూళ్ల మత్తులో జోగితున్నారు. మార్కెట్‎లో భారీగా డూప్లికేట్ మందులు చలామణిలో ఉన్నాయి. ప్రజలు సాధారణంగా వాడే అన్ని మందుల్లో కల్తీలు వచ్చేసాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్, డ్రగ్ ఏజెన్సిస్, ఫార్మాసిలో డ్రగ్ కంట్రోలర్ తనిఖీలు చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఇక కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం పేరుతో జరుగుతున్న దోపిడి అంతాఇంతా కాదు. ఈ దోపిడీ ఒపీతో స్టార్టై, అవసరం లేని అన్ని రకాల టెస్టులు వరకు సాగి, చివరికి, రోగి జబ్బుకి, డాక్టర్ రాసి ఇచ్చిన మందులకి సంబంధం లేనఒతవరకు ఉంటుంది. వీటన్నింటి కంటే దారుణమైన విషయం ఏమిటంటే, ఛావుబ్రతుకుల్లో ఉన్న పేషంట్ గాని, లేక చనిపోయిన వారి మృతదేహాన్ని వారి స్వగ్రామంకి తరలించాలంటే, వేలల్లో అంబులెన్స్ డ్రైవర్లకు డబ్బులు ముట్టచెప్పాల్సిన పరిస్థితి దాపురించింది. ఇటీవల కాలంలో తిరుపతి రుయా ఆసుపత్రిలో ఓ చిన్నారి అనారోగ్యంతో మృతి చెందితే, ప్రవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలను తట్టుకోలేక అతండ్రి బిడ్డ మృతదేహాన్ని భుజాన వేసుకుని, మోటర్ బైక్ పై వెళ్లిన ఘటన దిగ్భ్రాంతి గురిచేసింది. సమాజంలో, మనుషులలో మానవత్వం కరువైఒదని తెలుస్తోంది. ఈ మాఫియా వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది. కాబట్టే వారు ప్రజలను జలగాళ్ల పిక్కుతింటున్నారు. వీటన్నింటిని నియంత్రించడానికి, కూకటి వేళ్ళతో పెకిలించి వేయడానికి కూటమిని బలపర్చండి. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే, మెడికల్ మాఫియా భరతం పడుతాం. నిరుపేదలకు ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యాన్ని ఉచితంగా అందించేలా చర్యలు చేపడతాం కల్తీలు, నకిలీలు లేని ఆరోగ్యకరమైన తిరుపతి నగరాన్ని మీ అందరి సహకారంతో నిర్మిస్తాం.