Vizag: పవన్ కళ్యాణ్ బహిరంగ సభా వేదిక విషయంలో సందిగ్దత

పవన్ కళ్యాణ్ బహిరంగ సభా వేదిక విషయంలో సందిగ్దత. స్టీల్ ప్లాంట్ మెయిన్ రోడ్డుపై ఏర్పాటుకు సిద్ధం అయిన జనసేన. లారీల్లో చేరుకున్న స్టేజ్ మెటీరియల్. బహిరంగ సభకు లభించిన పోలీసులు అనుమతి. స్టేజ్ ఫేసింగ్ పై పోలీసులు, సభ నిర్వాహకుల మధ్య కొరవడిన సమన్వయం. వేలాదిగా జనం తరలివస్తే జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోతుందని పోలీసులు అభ్యంతరం. సభకు వచ్చేవారిని అడ్డుకోవడానికే పోలీసులు అభ్యంతరాలు పెడుతున్నారని జనసేన ఆరోపణ. ఈ విషయంలో సభకు పోలీసు ముందురోజు పర్మిషన్ ఇచ్చి…ఇప్పుడు స్టేజ్ పనులు మొదలు పెడితే ..పోలీసుఅధికారులు వచ్చి పర్మిషన్ ఇవ్వలేమని పనులు ఆపుతున్నారని దయచేసి పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, ఉద్యోగులు మరియు శ్రేయోభిలషులు కూర్మన్నపలెం సభా స్థలం వద్దకు విధిగా హాజరు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని కోన తాతారావు పిఏసి సభ్యులు, గాజువాక ఇంచార్జి పిలుపునివ్వగా సభాస్థలానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, ఉద్యోగులు మరియు శ్రేయోభిలషులు పాల్గొన్నారు.