డంపింగ్ యార్డ్ తక్షణమే తొలిగించాలి: గర్భాన సత్తిబాబు

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు, కూరంగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ముఖంగా సత్తిబాబు మాట్లాడుతూ
పాలకొండ నగర పంచాయతీ వెంకంపేట, నీళ్ల ట్యాంకు వీధి, జంగాల వీధి, కొత్త వీధి, కోరాడ వీధి, యాతల వీధి, రెల్లి వీధి, గొల్ల వీధి, గొడగల వీధి, కోమటి పేట, ఎన్.ఎస్.ఎస్. కాలనీ, వీవర్సు కాలనీ, మొదలగు వీధులలో సేకరించిన చెత్తను గొడగల వీధి దారిలో గల చెరువు ప్రక్కన డంపింగ్ చేస్తున్నారు. దీని వలన మా ప్రాంతంలో గల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ ప్రాంత ప్రజలందరూ డిసెంబర్ నెల 2019 సంవత్సరంలో డంపింగ్ యార్డ్ ఇచ్చుట ఏర్పాటు చేయవద్దని స్థానిక ప్రజలంతా నగర పంచాయతీ వారికి తెలియజేయడం జరిగింది. సదరు ఇచ్చటి నుండి డంపింగ్ యార్డ్ ను 3 నెలల్లో వేరే చోటకు తరలిస్తామని హామీ ఇచ్చారు. నేటికి 4 సంవత్సరాలు గడుస్తున్న డంపింగ్ యార్డ్ ను తరలించలేదు. నగర పంచాయతీ వారు చేస్తున్న డంపింగ్ వలన, ఈ చెరువు నీరు కలుషితమై, దిగువన గల పంట పొలాలకు వెళ్లే సాగునీరు కూడా పూర్తిగా కలుషితం అవ్వడం వలన పంటలు పాడైపోతున్నాయి. డంపింగ్ యార్డ్ ను ఇచ్చట నుండి తొలగిస్తామని నేటికి 4 సంవత్సరాలు కావచ్చిన ఇప్పటికీ చెరువు పక్కన చెత్త వేయడం ఆపడం లేదు. నగర పంచాయతీ పారిశుధ్య సిబ్బంది సేకరించిన 10 ట్రాక్టర్లు పెట్టే చెత్తను డంపింగ్ యార్డ్ కు రోజూ తరలిస్తుండడంతో ఈ చెత్త గుట్టల గుట్టలుగా పేరుకుపోతున్నవి. ఈ చెత్త మునిగిపోయి, కుళ్ళిపోయి దుర్గంధం వచ్చే దుర్వాసన ప్రబలి, దోమలు పురుగులు ప్రబలి, ఈ పరిసర పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మలేరియా, కలరా, దగ్గు, జలుబు, విష జ్వరాలు వచ్చి ఈ ప్రాంత ప్రజలంతా ఇబ్బందులకు గురి అవుతున్నారు. కావున తమరు మా విన్నపాన్ని పరిశీలించి ప్రజారోగ్యము దృష్టా త్వరితగతిని గొడగల వీధి ప్రాంతంలో చెత్తను డంపింగ్ చేయకుండా, సదరు డంపింగ్ యార్డ్ ను వేరేచోటకు తరలించాలని కోరారు. ఈ సందర్భంగా కూరంగి నాగేశ్వరరావు మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వ అధికారులు దీనిపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని లేనియెడల జనసేన పార్టీ తరుపున ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి అయినా మేము వెనకాడమని ఈ సందర్భంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, వెంకటరమణ, శేఖర్, నరేంద్ర, సాయి, సంతోష్, గజేంద్ర నాయుడు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.