ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు మార్చాలని కనపర్తి మనోజ్ కుమార్ డిమాండ్

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, పైరెడ్డిపాలెం గ్రామంలో జనసేన పార్టీ పొన్నలూరు మండల అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ బృందం శుక్రవారం పర్యటించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. పైరెడ్డిపాలెం గ్రామంలో అభివృద్ధి అనేది శూన్యం, ఎక్కడా కూడా ఎటువంటి డ్రైనేజీలు నిర్మించలేదు, మురికి నీళ్లు నిలువ ఉండి ప్రజలకు వ్యాధులు వ్యాపిస్తూ ఉన్నాయి. రెండు విద్యుత్ స్తంభాలు చిన్నపాటి గాలులకు చిన్నపాటి వర్షానికి కూడా పడిపోయే విధంగా ఉన్నాయి. ఆ విద్యుత్తు స్తంభాలు పడిపోతే కచ్చితంగా ప్రజలకు ప్రాణ నష్టం జరుగుతుంది. గ్రామస్తులు అధికారుల దృష్టికి మరియు వైసిపి నాయకుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు పట్టిపట్టనట్టుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. ఇకనైనా అధికారులు మరియు నాయకులు మేలుకొని పైరెడ్డిపాలెంలో ప్రమాదకరంగా ఉన్న రెండు విద్యుత్ స్తంభాలు తీసివేసి కొత్తవి వేయాలి, అదేవిధంగా సైడ్ కాలువలు కూడా నిర్మించాలి అని కనపర్తి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, పిల్లిపోగు పీటర్, పేయ్యల రవి, భాష, శ్రీను, భార్గవ్, సాయి మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.