జగన్ రెడ్డి మూడేళ్ళ పాలనలో అభివృద్ధి శూన్యం

*ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ధ్వజం

ప్రకాశం జిల్లా, జగన్ రెడ్డి మూడేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ముఖ్యంగా యువతకు ఉపాధి కరువైందని, రైతన్నకు భరోసా కరువైందని, మహిళలకు భద్రత కరువైందని, దళితుల మీద దాడులు ఎక్కువయ్యాయని కళ్యాణ్ అన్నారు. అలాగే జగన్ రెడ్డికి ఓటు బ్యాంకు మీద ఉన్న శ్రద్ధ, రాష్ట్ర అభివృద్ధి మీద లేకపోవటం బాధాకరం, ఇప్పుడు రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తుంది ఒక్కటే డైవర్షన్ పాలిటిక్స్, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడు, ప్రశ్నించే వారి మీద అక్రమ కేసులు పెడుతూ వారిని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నారు, ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవటం జరిగింది, సంపద సృష్టించకపోగా అప్పులు చేసి పంచుతూ మేమేదో ప్రజలను ఉద్దరిస్తున్నామని మాయ మాటలు చెబుతున్నారు, రానున్న రోజుల్లో మీ ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని కళ్యాణ్ ముత్యాల ధ్వజమెత్తారు.