క్వాంటమ్ సీడ్స్ బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్ 200 మంది అస్వస్థతకు లోనయ్యారు. క్వాంటమ్ సీడ్స్ యూనిట్‌లో ఒక్కసారిగా ఘాటైన వాయువు లీకయ్యేసరికి ఉద్యోగులు వాంతులు, విరేచనాలు, తల తిరుగుడుతో ఇబ్బందిపడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం, యాజమాన్యం వెంటనే బాధితులను హుటాహుటిన బ్రాండిక్స్ ఎస్ఈజేడ్‌లో ఉన్న ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ పనిచేసుకునే వారంతా చాలా పేద కుటుంబాలకు చెందిన వారు. నెల జీతం మీద బతికే వీరికి ప్రభుత్వం సాయం అందించాలి. వారి ఆసుపత్రి ఫీజులను ప్రభుత్వమే భరించాలి. ఇంకా వాళ్లకు అవసరమైన సౌకర్యాలను, మంచి ఆహారాన్ని అందించాలి. వాళ్ళు కోలుకునే వరకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాళ్లకు ఫుల్ శాలరీ వచ్చేలా యాజమాన్యానికి సూచించాలి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. దీనికి ఆ దేవుడికి కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వాయువు మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వమే ముందుండి ఆ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయాలని అందరికీ కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే బాధితులు అందరూ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.