మోసపూరిత హామీలతో ఉద్యోగులను వంచించడం తగదు: రేఖగౌడ్

ఎమ్మిగనూరు, వైసిపి ప్రభుత్వం ఉద్యోగులను మోసపూరిత హామీలు ఇచ్చి వంచించడం తగదని వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని జనసేనపార్టీ రాష్ట్ర మహిళ సాధికార ఛైర్మెన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ కర్నూల్ నగరం నందు వెంకటరమణ కాలనీలో విలేకర్ల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, అధికారంలోకి రావడానికి ఒక మాట, వచ్చాక మరో మాట మాట్లాడి లక్షలాది మంది ఉద్యోగులు మండుటెండలో రోడ్లపైకి వచ్చేలా చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానం రద్దు చేస్తామని ఉద్యోగుల జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాట మార్చడం ఏంటని ప్రశ్నించారు, నాడు పాదయాత్రలో ముద్దులు, నిరసిస్తే గుద్దులు పెట్టించడం వైసీపీకే చెల్లిందన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలు కూడా పెంచాలి తప్ప తగ్గించడం ఏంటని న్యాయ పరమైన డిమాండ్ల కోసం శాంతియుత నిరసనలు చేయుటకు వెళుతున్న ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం సిగ్గు చేటన్నారు, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ప్రభుత్వ శాఖలకు, చెందిన ఉద్యోగులు అందరు పలు విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు, ఉద్యోగుల పి.ఆర్.సి పెంచితే జీతాలు పెరగాలి అందుకు విరుద్ధంగా జీతాలు తగ్గే పి.ఆర్.సి అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు, ఉద్యోగులను చర్చల పేరుతో పిలిచి అవమానించారని అందుకే లక్షలాదిమంది ఉద్యోగులు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు చేసేందుకు కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు, నాయకులు ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించే విధంగా కృషిచేయాలని లేనిపక్షంలో ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం వారు చేస్తున్న నిరసనకు సన్నద్ధం అవుతున్న సమ్మెలో అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు జనసేనపార్టీ అండగా నిలబడతామని అన్నారు.