పార్టీ బలోపేతంలో జనసేన నాయకుల కృషి ప్రశంసనీయం: మనుక్రాంత్

జనసేన నాయకులకు జ్ఞాపికలు

నెల్లూరు నగరంలో జనసేన పార్టీ కోసం కష్టపడిన డివిజన్ ఇంచార్జులు, స్థానిక నాయకులకి జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు జ్ఞాపికలను ప్రత్యేకంగా తయారు చేయించారు. వాటిని నెల్లూరు నగరంలో జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ చేతుల మీద పార్టీ జ్ఞాపికలను అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు జనసేన నేతలు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ.. పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో కూడా పార్టీని నమ్ముకుని ఎంతోమంది నేతలు, కార్యకర్తలు సమాజంలో మార్పు కోసం పోరాటం చేస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు, అలియా తదితరులు పాల్గొన్నారు.