జనసేన పార్టీ క్షేత్రస్థాయి సమీక్షా సమావేశం

పాడేరు: జి.మాడుగుల మండలంలో బలమనుశంక, కులపాడు గ్రామాల యువత ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ బలోపేత సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో భాగంగా.. అరకు పార్లమెంట్, పాడేరు జనసేన పార్టీ ఇన్చార్జి డా..వంపురు గంగులయ్యతో కలిసి పంచాయితీ, మండల స్థాయిలో యువతను ప్రధాన భాగస్వామ్యం చేయాలని జనసేన సిద్ధాంతపు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం, ఆదివాసీ రైతుల పలు సమస్యలు వాటి పరిస్కారమార్గాలపై రైతులకు ఎలా అవగాహన కల్పించాలి, జనామోదం పొందడంలో జనసేన పార్టీ ఎటువంటి ప్రణాళికలు వేయాలి, అంతకంతకుపెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వాటి ప్రభావం సామాన్యుల బ్రతుకులపై భారం ఏ విదంగా ఉంది, రానున్న రోజుల్లో సగటు మనిషి జీవన వ్యయాలు ఎలా పెరుగుతుందో ఈ అంశాలపై ప్రజల్లో చైతన్యం ఎలా కల్పించాలి. ఈ ప్రాంతంలో నీరుగారిన విద్య, వైద్య, నిరుద్యోగ సమస్యలపై యువతలో ఎటువంటి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.. తద్వారా ప్రజలు తమకు తాముగా తెలుసు కుంటున్నారని, జనసేన పార్టీ నిర్దిష్ట లక్ష్యాలు, మ్యానిపేస్టొ, రైతు సాధికారతను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని, వీర మహిళలను క్షేత్ర స్థాయిలో భాగస్వామ్యం చేయడం వలన పార్టీలో మహిళాశక్తి పెంపొందించడం వంటి పలు కీలకమైన అంశాల పై చర్చించారు..ఈ కార్యక్రమంలో డా..వంపురు గంగులయ్య మాట్లాడుతూ.. యువత మేల్కోనవలసిన సమయం ఆసన్నమైందని.. ప్రజలు వారసత్వ రాజకీయాలని నమ్మే స్థితిలో లేరని అలా నమ్మితే ప్రజాస్వామ్యంలో ఉన్నామని బ్రమపడినట్టేనని.. ప్రజలను మోసపుచ్చుతూ తెలియకుండానే ఇన్నాళ్లు రాజరిక వ్యవస్థని నడుపుతున్న రాజకీయపార్టీలకు అధికారం ఇస్తున్నంతవరకూ.. ప్రజా సంక్షేమం నల్లేరు మీద నడకే అవుతుందని మీకు తెలిసిన విషయమే. ఆదివాసీ నిరుద్యోగ యువతకు జీవో నెం3 ఆయువు పట్టు లాంటిదని, ఈ ప్రభుత్వం పాలనలో ఆ హక్కు పూర్తిగా హరించి వేసిందని, కనీసం మాటమాత్రమైన ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల్లో నోరు మెదపకపోవడం అశ్యర్యం కలిగిస్తోందని, ఈ మౌనం వెనక ఏ మతలబు ఉందొ రానున్న ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్తారని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పారు. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు ఎటువంటి సహాయనిధులు ఏర్పాటు చేసి ఆదుకుంటున్నారో మనతో పాటు యావత్ రాష్ట్రం మొత్తం చూస్తుంది. అధికార, ప్రతిపక్షాల్లో లేకున్నా కూడా రైతు సంక్షేమం తన సర్వశక్తులోడ్డారు. ప్రజలు చూస్తూనే ఉన్నారని, ఈ ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఉత్తరాంధ్ర వీరమహిళా విభాగం కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు సందర్శించి రైతులు పండించే పంటలు, వాటి ఉత్పత్తి, గిట్టుబాటు ధర, స్టోరేజ్ సదుపాయలపై విస్తృతమైన సర్వే చేసారని త్వరలోనే చేపట్టబోయే పలు కార్యక్రమాలకు జనసేన పార్టీ రైతు సాధికారత కోసం ఎటువంటి దీక్ష, దక్షత కలిగివుంటుందో ప్రజలకు నేరుగా చెప్తామని తెలిపారు. ఇటువంటి విషయాలను ప్రజల్లో బలంగా యువత తీసుకెళ్లాలని ఈ సమావేశంలో జనసైనికులతో చెప్పారు. ఈ సమావేశంలో ఖుషి, చంటి, గణేష్, చలం, పండు, గోపి, విజేయేంద్ర, సతీష్, క్రిష్ణా, చంద్, సత్య పలువురు జనసైనికులు పాల్గొన్నారు.