గోరంట్లలో ఘనంగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

గోరంట్ల, పద్మశ్రీ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 67వ జన్మదిన సందర్భంగా గోరంట్లలోని స్థానిక సిటిసి థియేటర్ లో చిరంజీవి ఘరానా మొగుడు సినిమా షోలు వేయడం జరిగింది. అలాగే థియేటర్ వద్ద అభిమానులు కోలాహలంగా డప్పుల వాయిద్యాల మధ్య కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. చిరంజీవి అంటేనే సేవా భావం అని, కలియుగ దాన కర్ణుడు చిరంజీవి అని, ఆయన పుట్టిన రోజు అంటేనే అభిమానులకు పండుగ రోజు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత పెనుకొండ నియోజకవర్గ అధ్యక్షులు సి వెంకటేష్, జనసేన జిల్లా కార్యదర్శి సురేష్ పొగతోట వెంకటేష్ మెగా అభిమానూలు మను, నరసింహ, శ్రీనివాసులు, రమణ, గంగరాజు, పవర్ స్టార్ బాబ, అంజి, శేఖర, రాము, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.