జనసేన, టీడీపీ పార్టీల ఎన్నికల కార్యాచరణ సమావేశం

ఉమ్మడి కర్నూలు జిల్లా, నందికొట్కూరు నియోజకవర్గంలో కొత్తపల్లి మండలంలో చిన్న గుమ్మడాపురం మరియు సింగరాజు పల్లె గ్రామాల్లోనీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కలిసి రానున్న సాధారణ ఎన్నికల్లో ఇరు పార్టీ సభ్యులు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోనీ ప్రజల్లోకి తీసుకెళ్లి, వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రజలకు తెలియజేస్తూ మన పార్టీని గెలిపించుకోవాలని సమావేశం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ చిన్న గుమ్మడాపురం నుండి మళ్లీ రెడ్డి సురేష్, మళ్లీ రెడ్డి రవి, ఇక్బాల్, స్వాములు, మనోహర్, పవన్, అనిల్, విజయ్, ఏసేపు తదితరులు హాజరయ్యారు. అలాగే సింగరాజు పల్లె నుండి వెంకటేష్ మరియు మిత్రులు హాజరవడం జరిగింది. చిన్న గుమ్మడాపురం తెలుగుదేశం పార్టీ నుండి పేద దర్గయ్య, మైకు రాజు, చిన దుర్గయ్య, పుల్లయ్య, ధర స్వామి, మూర్తి తదితరులు పాల్గొన్నారు అలాగే సింగరాజు పల్లె నుండి జడ్డు వెంకటరెడ్డి (ఎక్స్ ఎంపీటీసీ), సుగురు భాస్కర్, చింతకుంట శివకుమార్, గోసాని నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రెండు గ్రామాలకు నందికొట్కూరు జనసేన పార్టీ నుండి జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయ సభ్యులు నల్లమల రవికుమార్, ప్రోగ్రామింగ్ కమిటీ మెంబర్ నవీన్ రెడ్డి, మద్దిలేటి, సంపత్, జలీల్ తదితరులు పాల్గొని అందరితో చర్చించి సమన్వయంగా ముందుకు సాగి రానున్న ఎన్నికల్లో విజయం సాధించాలని సందేశాన్ని ఇచ్చారు.