పార్వతీపురం మండలం వెంకంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం

పార్వతీపురం మండలం, వెంకంపేట గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే పార్వతీపురం నియోజకవర్గం జనసేన-తెలుగుదేశం-బిజెపి ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి హాజరైన బోనెల విజయ చంద్ర రాకతో సందడి వాతావరణం నెలకొంది వెంకంపేట గ్రామంలో భారీగా చేరుకున్న జనసేన-టిడిపి-బిజెపి కార్యకర్తలు నాయకులు, ఇంటింటికీ వస్తున్న విజయ్ చంద్రకి మంగళహారతి ఇస్తూ పూలమాలలు వేస్తూ నినాదాలతో మహిళలు ప్రజానీకం విజయ తిలకం దిద్ది ముందుకు తీసుకెళుతున్న వెంకంపేట గ్రామ ప్రజలు చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో అంశాలను ప్రజానీకానికి విజయ చంద్ర వివరిస్తుా ముందుకు నడవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకంపేట జనసేన నాయకులు పాత్ర ప్రదీప్, ధరణి, అజయ్ జనసేన, మండల అధ్యక్షురాలు ఆగూరు మని, జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు, అన్న బత్తుల దుర్గాప్రసాద్, సంతు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, విశ్వేశ్వరరావు, కనకరాజు, భాస్కర, జనసేన కార్యకర్తలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.