కోరుకొండ మండలంలో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

  • జననీరాజనాలతో బ్రహ్మరధం పడుతున్న ప్రజలు
  • కూటమి అభ్యర్థులకు పూలవర్షాలు కురిపిస్తూ హారతులతో అఖండ స్వాగతం పలుకుతున్న ప్రజానీకం
  • కూటమి అభ్యర్థులకు మద్దతుగా దగ్గుబాటి పురందేశ్వరి గారి కుమార్తె కొండ్రగుంట నివేదిత గారు ఎన్నికల ప్రచారం

కోరుకొండ మండలం, శ్రీరంగపట్నం గ్రామంలో జనసేన-తెలుగుదేశం- బిజెపి పార్టీల ఉమ్మడి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రాజమండ్రి పార్లమెంట్ ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారి కుమార్తె కొండ్రగుంట నివేదిత, రాజానగరం నియోజకవర్గం ఎన్.డి.ఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజానగరం నియోజకవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.