జనసేన నినాదాలతో హోరెత్తిన తాడేపల్లిగూడెం వనసమారాధన

పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం, జనసేన నాయకులు, పశ్చిమగోదావరి జిల్లా కాపు యువత అధ్యక్షులు, యువ పారిశ్రామిక వేత్త మరియు టీం సైనిక వ్యవస్థాపకుల్లో ఒకరైన మారిశెట్టి అజయ్ బాబు నాయకత్వములో కాపు యువత, కాపునాడు వంటి సంస్థలతో పాటు పట్టణంలోని కమ్యూనిటీ పెద్దలు, రాజకీయ నాయకుల అందరి సహకారంతో.. 20 ఎకరాల తోటలో సభా ప్రాంగణం, 150 బస్సుల ఏర్పాటుతో వచ్చి, పోయే వారి కోసం ప్రయాణ సౌకర్యం, హాజరైన 30 వేల అశేష ప్రజావహిణిలో 28 వేలకు పైగా కాపు సోదరులు, సోదరీమణులు మరియు 2 వేలకు పైగా వివిధ కుల, మత, వర్గాలకు అతీతంగా కలుపుకు పోతూ పెద్దన్న పాత్ర పోషిస్తూ జరిపిన సమాహార సమ్మోహన , సమ్మిళిత, ఆత్మీయ కలయికల వేదిక కాపు వన సమారాధన కార్యక్రమం పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం, వెంకట్రామన్న గూడెంలోని బండారు నాగన్న గారి తోటలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, ఎక్స్ ఎమ్మెల్యే ఈలి నాని, ఎక్స్ మున్సిపల్ ఛైర్మన్ ఈతకోట తాతాజీ, ఎక్స్ మున్సిపల్ వైస్ చైర్మన్ మారిశెట్టి సుబ్బారావు, మాకా శ్రీనివాస్, వడ్డి రఘురామ్, మారిశెట్టి సతీష్ బాబు, మంత్రాల పవన్ కుమార్ మరియు మారిశెట్టి అజయ్ బాబు యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇందు పాల్గొన్న వక్తలు అందరూ… సమిష్టిగా కులం పటిష్టతకు ప్రతి ఒక్కరు పాటు పడాలని, కాపు కార్పొరేషన్ ద్వారా ఏవిధంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ఏవిధంగా ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి, చెయ్యి, చెయ్యి కలుపు, చేజారదు గెలుపు అని సందేశ మిచ్చిన వంగవీటి మోహన రంగా సిద్ధాంతాలను, పేదల అభున్నతి కోసం ఆయన చేసిన బలి దానాలను కొని యాడారు. చివరిగా కాపు యువత అధ్యక్షులు, జనసేన లీడర్ ఆయిన అజయ్ బాబు తన సందేశంతో యువతను ఉర్రూత లూగిస్తు రేపు రాబోవు రోజుల్లో రాజ్యాధికారంలో కాపులను కూర్చోబెట్టాలని, కాపును సీఎం చేసే ప్రక్రియలో భాగంగా తమ ఎమ్మెల్యేలను గెలిపించాలని దిశా నిర్దేశం చేస్తూ సీఎంగా పవన్ కళ్యాణ్ ని రాజ్యాధికారంలో కూర్చోబెట్టాలని, జనసేన ఎమ్మెల్యేగా ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ ని గెలిపించాలని సంచలన వ్యాఖ్యలు చేసి యువత ఆశలను, ఆశయాలను వేదికపై వేలమంది యువత కేరింతలు, హర్ష ధ్వానాల మధ్య కుండ బద్దలు కొడుతూ సాగించిన ప్రసంగంతో 30 వేలమందితో కూడిన సభా ప్రాంగణం క్షణక్షణం చప్పట్లతో మార్మోగుతూ ఉత్కంఠ భరితంగా సాగింది. అలానే ప్రతి సంత్సరం కాపులంతా ఐకమత్యంతో ఈ వేడుకను ప్రతిష్ఠాత్మకంగా జరుపు కోవాలని ఆంక్షిస్తూ చివరిగా ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, సంస్థలకు, యువతకు మరియు ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతలను తెలిపారు.