పుట్టూరు గ్రామంలో బోనెల విజయ్ చంద్ర ఎన్నికల ప్రచారం

  • ఈసారి ఎమ్మెల్యేగా గెలుస్తారంటూ బోనెలను ఆశీర్వదించిన పుట్టూరు ప్రజలు

పార్వతీపురం మండలం, పుట్టూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే పార్వతీపురం నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయ్ చంద్ర ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా హాజరైన బోనెల విజయ చంద్ర రాకతో సందడి వాతావరణం నెలకొంది. పుట్టూరు భారీగా చేరుకున్న జనసేన-టిడిపి- బిజెపి కార్యకర్తలు నాయకులు, ఇంటింటికీ వస్తున్న విజయ్ చంద్ర గారికి నినాదాలతో మహిళలు ప్రజానీకం పూల మాలలు వేసి విజయ తిలకం దిద్ది మంగళ హారతులు పడుతున్న పుట్టూరు గ్రామం ప్రజానీకం, చంద్రబాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో అంశాలను ప్రజానీకానికి వివరిస్తుా ముందుకు నడిచిన విజయ చంద్ర ఈ కార్యక్రమంలో జనసేన, మండల అధ్యక్షురాలు ఆగూరు మని, అన్న బత్తుల దుర్గాప్రసాద్, రాకేష్, మౌలేశ్వరరావు, రామకృష్ణ, సంతు, గుంట్రెడ్డి గౌరీ శంకర్, చిట్లు గణేశ్వరరావు, విశ్వేశ్వరరావు, కనకరాజు, భాస్కర, జనసేన కార్యకర్తలు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.