పారిశుద్ధ కార్మికుల సమ్మెకు ఎమ్మిగనూరు జనసేన మద్దతు

ఎమ్మిగనూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల 3వ రోజు సమ్మెకు ఎమ్మిగనూరు జనసేన నాయకులు చల్లా వరుణ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చల్లా వరుణ్ మాట్లాడుతూ కరోనా సమయంలో వాళ్ళు చేసిన సేవలు మరవలేనివి అని అన్నారు. జగన్ పాదయాత్ర సమయంలో పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేసి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత విస్మరించడం మోసం చేయడమేనని ఆరోపించారు. గత నాలుగున్నర ఏళ్లుగా సహనం కోల్పోయే సమ్మెకు దిగారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంలో ఘోరంగా విఫలం చెందారని మండిపడ్డారు. ఆప్కాస్ తీసుకువచ్చి కార్మికుల నోట్లో మట్టి కొట్టారని ఆవేదన చెందారు. ఆప్కాస్ ఫలితంగా చనిపోయిన కార్మికుల కుటుంబాలలో ఇతరులకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదని ఆవేదన చెందారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వకపోగా, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు దూరం చేశారని దుయ్యబట్టారు. కరోనా సమయంలో ఫ్రంట్ వారియర్స్ గా పని చేసి మరణించిన కార్మికులకు వారి కుటుంబాలను ఆదుకునేలా రూ.5 దీంతో వారి కుటుంబాలు ఆకలి కేకలతో అలమ కార్మిక సమస్యలు పరిష్కరించకపోవడంతో జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మొన్న అంగన్వాడీలు, నిన్న ఆశా వర్కర్లు, నేడు మున్సిపల్ కార్మికులు, సమ్మె చేస్తున్నారంటే పరిపాలన చేయడంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. సమానం వేతనం వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ ఔట్ సోర్సింగ్ కార్మికులందరికి పర్మినెంట్ చెయ్యాలి సగం పెన్షన్ ఇవ్వాలి. అలవెన్స్ జీత భ్యతలు సకాలంలో చెల్లించాలి. డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మున్నా, గోరంట్ల, నవీన్, జనసేన సైనికులు పిరవలి, వినోద్, మహబూబ్, రమేష్, చంద్ర తదితరులు పాల్గొన్నారు.