తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు

కరోనా నిబందనలను పాటిస్తూ ఈ రోజు నుంచి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. బుధవారం, గురువారం, శుక్రవారం, సోమవారం ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా రెండు సెషన్స్‌లో ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. మధ్యాహ్నం 3నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఇందుకోసం మొత్తం 102 సెంటర్లను సిద్ధం చేయగా.. అందులో 79 తెలంగాణలో, 23 ఏపీలో ఉన్నాయి. 1,43,165 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలని సూచించారు. నిమిషం అలస్యమైనా ఎంట్రీ ఉండదని అధికారులు తెలిపారు. గంటన్నర ముందు నుంచే పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుమతిని ఇస్తారని వివరించారు. ఇక అభ్యర్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని ఎంసెట్ అధికారులు తెలిపారు. పాజిటివ్ ఉన్న విద్యార్థుల కోసం మరోసారి పరీక్ష నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.