గుంతకల్లు నియోజకవర్గములో జనసేన పార్టీలోకి భారీ చేరికలు

గుంతకల్లు నియోజకవర్గం: పామిడి మండలంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం నిస్వార్ధంగా పనిచేయడానికి అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ ముఖ్యఅతిథిగా మరియు అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరైన కార్యక్రమంలో జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షులు యం.ధనుంజయ ఆధ్వర్యంలో అనిల్ కుమార్ తో సహా నాయకుల సమక్షంలో పలువులు యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గంలో బలంగా పనిచేస్తుందని, ముఖ్యంగా పామిడి మండలంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు బలంగా పనిచేస్తూ జనసేన పార్టీని ముందుకు తీసుకు వెళుతున్నారని, కార్యకర్తలే పార్టీకి కొండంత అండ అని పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా జనసైనికులు అందరూ కలిసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకు వెళ్లి జనసేన జెండా ఎగురవేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పెద్దగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.