బత్తుల ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

రాజానగరం నియోజకవర్గ౦, సీతానగరం మండలం, వెలమపేట గ్రామానికి చెందిన పలువురు జనసేన పార్టీ యొక్క రాజకీయ విధానాలు, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి… టిడిపి, వైసిపి నుంచి 25 మంది “నాసేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారికి జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. చేరిన వారిలో గోకేడ సూరిబాబు భార్య సూర్యవతి, షేక్ బాబ్జి భార్య షేక్ ఆశ, వారి అనుచర గణం 25 మంది బీసీ మరియు ముస్లిం సామాజికవర్గానికి చెందిన వారు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీర మహిళ కోడి వేణు, మట్ట వెంకటేశ్వరరావు, ప్రశాంత్ చౌదరి, ప్రగడ శ్రీహరి, మూర్తి, బైలపూడి శ్రీను, పీత సత్తిబాబు, కాశీలంక ముని, చుక్కాకుల నారాయణ, పి. దుర్గా ప్రసాద్, పి.రాజు, బరకం మణి, సందీప్, జి మణి, ధర్మ సత్యసాయి, పి.ఏసు, సుందరపల్లి శ్రీను, జువ్వాది నరేంద్ర, ఏ.సుబ్బు పాల్గొన్నారు.