“నా సేన కోసం నా వంతు” కు యూరప్ జనసేన జూమ్ సమావేశం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమ కమిటీతో యూరప్ జనసేన శనివారం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ చైర్మన్ బొంగునూరి మహేందర్ రెడ్డి ముఖయ్ అతిధిగా జరిగిన ఈ సమావేశంలో ఆ కమిటి సభ్యులు రుక్మిణి కోటా, పసుపులేటి సంజీవ్ మరియు యూరప్ జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ చైర్మన్ బొంగునూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నారై సభ్యులు పార్టీ కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని మరియు పార్టీ బలోపెతం కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు పార్టీని ఆర్ధికంగా బలోపేతం చేయడం ద్వారా పార్టీ మరింత బలపడుతుందని, కోటి మందిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలని కోరడం జరిగింది. ఈ 2024 ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి అని మనం విజయం సాధించాలంటే మరింత కష్టపడాలని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు మాట్లాడుతు వారు అడిగిన సందేహాలకు ‘నా సేన కోసం నా వంతు’ కమిటీ సభ్యులు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఈ వారంలో యూరప్ ఎన్నారై జనసేన తరపున అధినేత తలపెట్టిన “రైతు భరోసా యాత్ర” మరియు “నా సేన కోసం నా వంతు” లకు రూపాయలు 5,55,555/- విరాళంగా పంపించడం జరిగిందని దానికి సంబందించి జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు జనసేన నాయకులు కొణిదల నాగబాబు యూరప్ జనసేన టీమ్ ను అభినందించడం జరిగిందని తెలిపారు.